PS-2 Release Date | ఎన్నో ఏళ్ళ తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’తో కమర్షియల్ సక్సెస్‌ను సాధించాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఈ ఏడాది అత్యధిక గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.460 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్ డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
పొన్నియన్ సెల్వన్ పార్టు-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చియాన్ విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది.
Confirmed – #ManiRatnam’s #PS2 (#PonniyanSelvan2) Locked for April 28, 2023 release. Announcement expected today in the success meet. #Vikram #JayamRavi #Trisha #Karthi #AishwaryaRaiBachchan https://t.co/su7T3rbJ1v
— Himesh (@HimeshMankad) November 4, 2022
Read Also:
Ram Charan-Sukumar | ‘రంగస్థలం’ కాంబో రిపీట్ కానుందా?
Akshay Kumar | తొలిసారి మరాఠా మూవీలో అక్షయ్ కుమార్..!
టెలివిజన్‌లో ‘ఆచార్య’ షాకింగ్ టీఆర్పీ.. ఆ సీనియర్ హీరోల దగ్గరకు కూడా రాలేకపోయిన చిరు..!