సినీ ఇండస్ట్రీ (film industry)లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోయిన్లలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు ఛేదు అనుభవాలను ఎదుర్కొన్న ఉన్నవాళ్లే. హీరోలు, దర్శకులు, నిర్మాతల చేతిలో ఏదో ఒక సందర్భంలో వివక్షకు, వేధింపులకు గురైనవాళ్లే. అలాంటి ఛేదు ఘటనే అలనాటి అందాల తార ఇషా కొప్పీకర్ (Isha Koppikar)కు ఎదురైందట. చంద్రలేఖ(Chandralekha) సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ముంబై భామ ఇషా కొప్పీకర్.
ఆ తర్వాత వెంకటేశ్ తో ప్రేమతో రా, శ్రీహరి నటించిన కేశవలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ ఏడాది దహనం వెబ్‌సిరీస్ (Dahanam Webseries)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇషా. ఈ భామ గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఓ మీడియా ఛానల్‌తో చెప్పుకుంది. ఇంతకీ అదేంటంటే ఓ హీరో తనను ఒంటరిగా కలవాలన్నాడట. సదరు హీరోకు అభ్యంతరం చెప్పినపుడు ఏ కారణం లేకుండా ఇషా కొప్పీకర్ ను ఆ సినిమా నుంచి తొలగించినట్టు చెప్పింది.
‘ఆ హారో అలా అడిగినపుడు నా హృదయం బద్దలైనదానికంటే ఎక్కువ పనైపోయింది. మీరు మంచి హీరోల జాబితాలో ఉండరని నాకు తెలియదు..అందుకే ఊహించిన ఘటనతో తాను భయపడ్డానని’ చెప్పుకొచ్చింది ఇషా కొప్పీకర్. ప్రస్తుతం హిందీలో అస్సీ నబ్బే పూరే సౌ, తమిళంలో అయలాన్ సినిమాలో నటిస్తోంది.