టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కాంబినేషన్ల జాబితాలో ఎన్టీఆర్ (Jr NTR)-కొరటాల శివ (Koratala Siva) ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ ఇద్దరూ మరోసారి ఎన్టీఆర్ 30తో అలరించేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కాగా కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు తారక్. అయితే ఆర్ఆర్ఆర్ లో రోరింగ్ లుక్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్ ఈ సారి చేయనున్న కొరటాల శివ సినిమా కోసం మాత్రం మేకోవర్ మార్చుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇక ఇపుడు నెట్టింట్లో లేటెస్ట్ గా చక్కర్లు కొడుతున్న ఫొటో తారక్ కొత్త లుక్‌పై స్పష్టత ఇచ్చేస్తుందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. జీన్స్, టీ షర్ట్, మ్యాచింగ్ షూస్‌తో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ౩౦లో తారక్ కనిపించబోయే లుక్ ఇదేనంటూ ఫిక్సయిపోతున్నారు ఫాలోవర్లు, అభిమానులు, మూవీ లవర్స్.
మొత్తానికి ఏదో ఒక అప్డేట్తో అభిమానులని ఫుల్ ఖుషీ చేస్తున్నాడు తారక్. కొరటాల సినిమా షూటింగ్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31ను కూడా ప్రకటించాడు.
ఎన్టీఆర్ ట్రెండింగ్ స్టిల్..
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ