హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఉదయం 10:30గంటలకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు.
ఈ మేరకు శుక్రవారం భవన్ ఇన్చార్జి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.