అభివృద్ధి కాదు.. ఆగం చేస్తున్నరు
‘నువ్వా రేవంత్రెడ్డి పేద దళిత, గిరిజనులను ఉద్ధరించేది. చెప్పే మాటలకూ చేసే పనులకు ఎకడా పొంతన ఉండనే ఉండదు’ అంటూ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- రేవంత్ వ్యాఖ్యలపై పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం
- 150 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘నువ్వా రేవంత్రెడ్డి పేద దళిత, గిరిజనులను ఉద్ధరించేది. చెప్పే మాటలకూ చేసే పనులకు ఎకడా పొంతన ఉండనే ఉండదు’ అంటూ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత రూ.150 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్కుమార్, రాష్ట్ర కార్యదర్శి సతావత్ రమేశ్నాయక్ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం రూ.150కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉన్నదని గుర్తుచేశారు. నిధులను విడుదల చేయకపోవడంతో ఆ పాఠశాలలు మూసివేసే దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. విషయాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, 40 వేల మంది దళిత, గిరిజన పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిజంగా బహుజనులపై చిత్తశుద్ధి ఉంటే బకాయిలను తక్షణం విడుదల చేయాలని సర్కార్కు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

