National Film Awards | జాతీయ అవార్డుల్లో ఆ సినిమాలకు అన్యాయం జరిగిందా..?
National Film Awards | ముఖ్యంగా తమిళ సినిమాలకు ఈసారి కావాలని అవార్డులు ఇవ్వలేదని వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. దీనిపై తమిళ తంబీలు కూడా చాలా కోపంగా ఉన్నారు. 2021 సంవత్సరంలో తమ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రాలేదా అంటూ వాళ్లు అడుగుతున్నారు.
National Film Awards | అందర్నీ సంతృప్తి పరచడం ఎవరివల్లా కాదు.. ఈ అవార్డులు అందరం చర్చించుకుని తీసుకున్న నిర్ణయం.. జూరీ అందరూ చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాలు ఎంపిక చేశారు.. దీనివల్ల కొందరు సంతోషంగా ఫీల్ అవుతారు.. మరికొందరు బాధపడతారు.. దయచేసి అర్థం చేసుకోండి.. నేషనల్ అవార్డ్స్ ప్రకటించే ముందు స్పెషల్ జ్యూరీ మీడియా ముందు చేసుకున్న రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే వాళ్లకు తెలుసు.. అవార్డ్స్ ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని అద్భుతమైన సినిమాలకు అవార్డ్స్ మిస్ అవ్వడం.. వాటి మీద విమర్శలు రావడం కామన్ అని..! ప్రతిసారి ఇది జరుగుతుంది.. ఈసారి ఇంకాస్త ఎక్కువగానే ఈ విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తమిళ సినిమాలకు ఈసారి కావాలని అవార్డులు ఇవ్వలేదని వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. దీనిపై తమిళ తంబీలు కూడా చాలా కోపంగా ఉన్నారు.
2021 సంవత్సరంలో తమ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రాలేదా అంటూ వాళ్లు అడుగుతున్నారు. సూర్య హీరోగా జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్ సినిమా అంత పెద్ద విజయం సాధించడమే కాకుండా.. ఒక సోషల్ కాజ్ మీద తీసిన సినిమా కాదా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో సూర్య నటన బాలేదా.. ఆయన ఉత్తమ నటుడిగా పనికిరాడా అంటూ మండిపడుతున్నారు. మరోవైపు సార్పట్టా పరంపర సినిమా మీకు కనిపించలేదా.. అందులో ఆర్య నటన మీకు పట్టలేదా అంటూ వాళ్లు స్పెషల్ జ్యూరీని ప్రశ్నిస్తున్నారు. ధనుష్ నటించిన కర్ణన్ సినిమా కూడా నేషనల్ ఫిలిం అవార్డుల్లో అన్యాయం జరిగిందని తమిళ తంబీలు ఆరోపిస్తున్నారు.
ఇది మాత్రమే కాదు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో సినిమా అని వచ్చిన మిన్నల్ మురళి సినిమాను జూరీ కనీసం పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఏదో కంటి తుడుపు చర్యగా తమిళంలో ఒకటి.. మలయాళంలో ఒక సినిమాలకు అవార్డులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మిగిలిన సినిమాల విషయంలో ఏమో కానీ జై భీమ్ సినిమాను కనీసం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వర్షం కురుస్తుంది. అది కచ్చితంగా అవార్డు సాధించాల్సిన సత్తా ఉన్న సినిమా.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం ఏంటి అని విశ్లేషకులు కూడా వాదిస్తున్నారు. ఈ అవార్డుల వెనక ఏదైనా రాజకీయం దాగుందా లేదంటే నిజంగానే జ్యూరీ సభ్యులకు జై భీమ్ సినిమా నచ్చలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిసారి అవార్డుల ప్రకటన తర్వాత విమర్శలు రావడం సర్వసాధారణం. కానీ ఈసారి వాటి ప్రభావం అయితే కచ్చితంగా ఎక్కువగానే ఉండబోతుంది. అనే విషయం కొన్ని గంటల్లోనే జ్యూరీ సభ్యులకు అర్థమయిపోయింది. మరి వాళ్ల నుంచి ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
Read More :
Pushpa The Rise | జాతీయ అవార్డులు గెలుచుకోవడంలో పుష్ప సినిమాకు కలిసొచ్చిన అంశాలివే!
National Film Awards | వీళ్లు హీరోయిన్లా అని అవమానించారు.. వాళ్లే నేషనల్ అవార్డు కొట్టి చూపించారు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

