తేజ చిత్రం సీక్వెల్ వాయిదా పడిందా?
దాదాపు 21 ఏళ్ల తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు తేజ. హీరో హీరోయిన్లతో పాటు అంతా నూతన నటీనటులే ఈ సినిమాలో నటిస్తారని చెప్పాడు.

తెలుగు ఇండస్ట్రీలో చిత్రం సినిమాను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి నిదర్శనం ఈ సినిమా. దర్శకుడు ఎవరో తెలియదు.. హీరో ఎవరో తెలియదు.. హీరోయిన్ ఎవరో పరిచయం లేదు.. అసలు సినిమా పూర్తయ్యే వరకు విడుదలయ్యే సంగతి కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి సంచలన విజయం సాధించింది చిత్రం. 2000లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఉదయ్ కిరణ్ కు లైఫ్ ఇచ్చింది. తేజ ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వు నేను, జయంతో సంచలన విజయాలు అందుకుని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అలాంటి సంచలన సినిమాలు అందించిన తేజ.. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు. ఈ మధ్యే ఈ సినిమాను అనౌన్స్ చేశాడు కూడా. చిత్రం 1.1 పేరుతో సీక్వెల్ ప్రకటించాడు ఈ దర్శకుడు. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

దాదాపు 21 ఏళ్ల తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు తేజ. హీరో హీరోయిన్లతో పాటు అంతా నూతన నటీనటులే ఈ సినిమాలో నటిస్తారని చెప్పాడు. ఈ సినిమా కోసం చాలా ఏళ్ళ తర్వాత ఆర్పీ పట్నాయక్ మళ్లీ సంగీతం అందిస్తున్నాడు. ఈయనకు తేజ కాంబినేషన్ బాగా కలిసొచ్చింది. కొన్నేళ్లుగా సంగీతానికి దూరంగా ఉన్న ఆర్పీ.. తేజ కోసం వస్తున్నాడు. అప్పుడు చిత్రం సినిమాకు ఉదయ్ కిరణ్ దొరికాడు. ఇప్పుడు అలాంటి హీరో ఒకరు కావాలి.. ముందు తన తనయుడు అమితోవ్ తేజను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడు తేజ. ఎన్టీఆర్ బావమరిది ఈ సినిమాలో హీరోగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ సడెన్‌గా దగ్గుబాటి అభిరామ్ సీన్లోకి వచ్చాడు. చిత్రం 1.1 కోసం అభిరామ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు తేజ. ఇదే విషయాన్ని అభిరామ్ కన్ఫర్మ్ చేశాడు. తాను తేజ సినిమాతో పరిచయం కాబోతుండటం ఆనందంగా ఉందని తెలిపాడు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమాను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడం ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్‌తో మూవీ పక్కా అంటున్న బండ్ల గణేష్..!
అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్
కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్
అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్
సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

