Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన చివరి చిత్రం ‘కీడా కోలా’ విడుదలై దాదాపు ఏడాదిన్నర తర్వాత తరుణ్ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సురేష్ ప్రోడక్షన్ తాజాగా క్రేజీ అప్డేట్ను పంచుకుంది. గ్యాంగ్ మళ్లీ గ్యాదర్ అయ్యింది మైక్. జూన్ 29న కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతుందంటూ సురేష్ ప్రోడక్షన్ ప్రకటించింది. అయితే ఈ అప్డేట్ చూస్తుంటే తరుణ్ భాస్కర్ తన ఐకానిక్ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మూవీ లవర్స్‌కి పండగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌కి ఉన్న విపరీతమైన పాపులారిటీ ఈ సినిమాకి జత కానుంది.
స్వాగతం….సుస్వాగతం….😎
Team Kanya Raasi is Coming Back ❤️Exciting things are lined up for June 28 & 29 🫶🏻#ENEModeOn #TharunBhascker @SureshProdns @SOriginals1 pic.twitter.com/tmL8BMatxZ
— Suresh Productions (@SureshProdns) June 26, 2025
Read More