Vijay Devarakonda | అగ్ర నటుడు విజయ్ దేవరకొండ కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. ఇన్నిరోజులు కింగ్డమ్ సినిమా కోసం షార్ట్ హెయిర్‌తో కనిపించిన విజయ్ ప్రస్తుతం జుట్టు పెంచి క్లీన్ షేవ్ మీసాలతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. అయతే ఈ లుక్ విజయ్ కొత్త సినిమా కోసం అని తెలుస్తుంది. ఇటీవలే గౌతమ్ తిన్ననూరితో కలిసి కింగ్డమ్ సినిమాను కంప్లీట్ చేశాడు విజయ్. ఈ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ రవి కిరణ్ కోలాతో రౌడీ జనార్థన్ అనే సినిమా రాహుల్ సాంకృత్యాన్‌తో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో ఒక సినిమా కోసం విజయ్ తన లుక్‌ని మార్చినట్లు తెలుస్తుంది. అయితే అది ఏ సినిమా అనేది చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read More