మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 16:03:49

బాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ను మిస్సవుతుందా..!

బాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ను మిస్సవుతుందా..!

2008లో వచ్చిన రబ్‌ నే బనా దీ జోడీ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ. ఆ తర్వాత స్టార్‌ హీరోలతో నటిస్తూ కోట్లలో ఫాలోవర్లను ఖాతాలో వేసుకుంది. స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో ఉన్న ఈ భామ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించింది. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో అనుష్క శర్మ టాప్‌ ప్లేస్‌లో ఉంది. అయితే బాలీవుడ్‌ ఇండస్ట్రీ గొప్ప టాలెంట్‌ కలిగిన హీరోయిన్‌ను కోల్పోతున్నట్టు బీటౌన్‌లో డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. అనుష్క శర్మ తన దగ్గరకు వచ్చిన సినిమా స్క్రిప్ట్‌లను తిప్పి పంపుతుందట.టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ చాలా వరకు యాక్టింగ్‌ ఆఫర్స్‌ను వదులకుంటున్నదని టాక్‌ వినిపిస్తోంది. ఈ భామ యాక్టింగ్‌ కు దూరమవుతూ  తన సోదరుడు కర్నేష్‌ శర్మతో కలిసి సినిమాలు నిర్మించే పనిలో ఉంది.

అనుష్క ఇప్పటికే ఐదు చిత్రాలతోపాటు కొన్ని వెబ్‌సిరీస్‌లు కూడా నిర్మించగా..మంచి విజయాన్ని అందుకున్నాయి. అనుష్క శర్మ ప్రస్తుతం డార్క్‌, హార్రర్‌ సినిమాలపై తన ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. మరి సినిమాల నిర్మాణంతో బిజీ అయిన అనుష్క మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై ఎప్పుడు సందడి చేస్తుందనేది..కాలమే నిర్ణయిస్తుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo