RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ఆర్సీ16 (RC16). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ మొదలు కానుంది. జులైకల్లా షూటింగ్ పూర్తి చేసి.. దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరో క్రేజీ గాసిప్ కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఏఆర్ రెహమాన్‌కు బదులు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను రీప్లేస్ చేశారని ఇండస్ట్రీ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై బుచ్చి బాబు టీం పుకార్లుగా కొట్టిపారేసిందని ఫిలింనగర్ మరో వార్త తెరపైకి వచ్చింది. ఇక ఏడేండ్ల తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగు ఇండస్ట్రీకి కమ్‌బ్యాక్ ఇస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి. ఆర్సీ16లో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ జగ్గూభాయ్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది