Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ఇంట పెళ్లి సందడి మొదలైంది. అమీర్ కూతురు ఐరా ఖాన్ (Ira Khan) నిశ్చితార్థం నిపూర్ శిఖరే (Nupur Shikhare)తో గతేడాది నవంబర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఐరా-శిఖరే వివాహానికి కుటుంబ సభ్యులు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (pre wedding festivities)ను మొదలు పెట్టారు.
మహారాష్ట్ర సాంప్రదాయ కెల్వన్ వేడుక (Kelvan ceremony)తో ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యారు. ఐరా సాంప్రదాయ మహారాష్ట్ర నాథ్ ధరించి సందడి చేసింది. ఇక ఈ వేడుకలకు ఐరా తల్లి రీనా దత్, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కాబోయే కొత్త జంటకు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఓ సైక్లింగ్ ఈవెంట్లో ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ సడెన్గా వచ్చి ఐరాకు ప్రపోజ్ చేశాడు. ఆమె వేలికి రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం ఐరా.. నుపూర్కు లిప్ కిస్ ఇచ్చి.. తన ప్రేమను తెలిపింది. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట.. పెద్దల అంగీకారంతో గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక నిశ్చితార్థమైన ఏడాది తర్వాత ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
Also Read..
Vasundhara Raje | ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోంది.. రాజస్థాన్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
Heavy rain | చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
Pakistan Air Base: యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులు