ఈ ఏడాది భీమ్లానాయక్ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కొషియుమ్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా పవన్ కల్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ (Sujeeth)తో ఓ సినిమా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇపుడిదే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఆసక్తికర విషయమేంటంటే ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కించిన డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇంకో విషయమేంటంటే ఈ మూవీ కూడా రీమేక్ అట. కానీ ఈ సారి రీమేక్ చేయబోతుంది తమిళ సినిమా అని టాక్. పవన్ ప్రస్తుతం 17వ శతాబ్ద కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) లో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీఫిలింసిటీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోతో సాహో చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మరోవైపు సముద్రఖని డైరెక్షన్లో వినోధయ సీతమ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు పవన్. దీంతోపాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కీ రోల్ లో కనిపించనుందని వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.