AnnaGaru Vostaru | కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ (Karthi) నటిస్తోన్న చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో రిలీజ్ కానుంది.
ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. ఊహించని విధంగా వాయిదా పడ్డది. తాజా అప్డేట్ ప్రకారం ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అన్నగారు వొస్తారు రేపు విడుదల కావడం లేదు. సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కోర్టు సినిమా రిలీజ్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నగారు వొస్తారు యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమా విడుదల వాయిదా విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేశాడు. తమ అభిమాన హీరో సినిమాను మరికొన్ని గంటల్లో థియేటర్లలో చూసేందుకు రెడీ అవుతున్న మూవీ లవర్స్‌కు తీవ్ర నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి.
అన్నగారు వొస్తారు కూడా అఖండ 2 (ముందుగా నిర్ణయించిన ప్రకారం) డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. పెండింగ్ వర్క్ కారణంగా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కార్తీ తన సినిమాకు బాలకృష్ణ అఖండ 2 లాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాడని చర్చ నడుస్తోంది. ఈ లెక్కన మరి కార్తీ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందనేది చూడాలి.
అన్నగారు వొస్తారు చిత్రంలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Akhanda 2 | రిలీజ్‌కి కొద్ది గంటల ముందు విడుదలైన శివ శివ సాంగ్..హార్ట్ టచింగ్‌గా ఉన్న లిరిక్స్
అఖండ2 సినిమా ప్రీమియర్ షోలకు టిక్కెట్ ధర పెంపు జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
Pragathi | ఈ వయస్సులో నీకు అవసరమా అన్న వాళ్లకి ఇదే నా సమాధానం.. ప్రగతి ఫైరింగ్ స్పీచ్