అఖండ2 సినిమాకు టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోరులో శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు శారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన హైకోర్టు ఈరోజు ప్రదర్శించే ప్రీమియర్ షోలకు ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసంది. సినిమా నిర్మాణ సంస్థ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది.
అఖండ2 మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావలసి ఉంది. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకి డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడయ్యారు. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు నడపడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.