Pragathi | టాలీవుడ్లో తల్లి, అత్త, అక్క, వదిన వంటి అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి ప్రగతి మరోసారి తన ప్రతిభతో, పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కరోనా తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన ప్రగతి, రీల్స్ ద్వారా, స్టెప్పులతో, పబ్లిక్ అప్పియరెన్స్‌లతో పెద్ద ఎత్తున పాపులారిటీ దక్కించుకుంటుంది. అయితే సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ నటి, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అసలు సిసలైన ఫైటర్‌గా నిలుస్తోంది.కరోనా సమయంలో జిమ్ వర్కౌట్స్‌తో మొదలైన ప్రయాణం, నేడు ఆసియా లెవెల్ పతకాల వరకూ తీసుకెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌పై ఘనమైన పట్టు సాధించిన ప్రగతి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరుసగా పతకాలు గెలుచుకుంటూ 50 ఏళ్ల వయసులో కూడా యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది
తాజాగా టర్కీలో జరిగిన Asian Open & Masters Powerlifting Championship 2025లో పాల్గొన్న ఆమె, నాలుగు పతకాలు సాధించి అందరు తలెత్తుకునేలా చేసింది. ఈ అద్భుత గెలుపుతో సోషల్ మీడియాలో ప్రగతి పేరు మారుమోగుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అందరూ వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతంలో ప్రగతి జిమ్‌లో పెట్టిన ఫోటోలపై కొందరు నెటిజన్లు నెగటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. జిమ్ డ్రెస్సింగ్‌పై, వయసుపై, వర్కౌట్పై వదిలిన టాక్సిక్ కామెంట్లకు ఆ సమయంలో ప్రగతి మౌనంగా ఉన్నప్పటికీ, తాజాగా త్రీ రోజెస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె, ట్రోలర్స్‌కు ఘాటు సమాధానం ఇచ్చింది.
ఈవెంట్లో ఆమెను ప్రత్యేకంగా సన్మానించిన తర్వాత ప్రగతి మాట్లాడుతూ.. ఈ జర్నీని మొదలుపెట్టినప్పుడు ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అని చాలా మంది అన్నారు. జిమ్‌లో జిమ్ బట్టలే వేసుకోవాలి. చీర, చుడీదార్లతో వర్కౌట్స్ ఎలా చేస్తాం? అయినా నాపై నెగటివ్‌గా ఎంత ట్రోల్స్ చేశారు! మొదట్లోనే ‘నేనేమైనా తప్పు చేస్తున్నానా?’ అని నాకే డౌట్ వచ్చింది. నా కూతురు కాలేజీలో ఉంది, ఆమె ఫ్రెండ్స్ కూడా చూస్తారు. వాళ్లపై కూడా ఇది ప్రభావం పడుతుందేమో అని బాధపడ్డాను. కానీ ట్రోలర్స్‌కి నేను సాధించిన ఈ పతకాలే అసలైన సమాధానం.”అంతేకాక, తన విజయాన్ని ఇండస్ట్రీకి చెందిన అందరు మహిళలకు అంకితం చేస్తున్నాను అని తెలిపింది. ఆమె మాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.