Vishwak sen | ఓ వైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశ్వక్సేన్ (Vishwak sen). స్వీయ దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ధమ్ కీ సీక్వెల్ కూడా ఉండబోతున్నట్టు తెలియజేసి క్యూరియాసిటీ పెంచాడు విశ్వక్సేన్. ఇదిలా ఉంటే ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11 (VS 11)వ సినిమా కూడా ఇటీవలే లాంఛ్ చేశాడు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో షురూ కానుందని కృష్ణ చైతన్య టీం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్లను ఫైనల్ చేశారని.. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్ సేన్ మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న గామి (Gaami) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే గామి విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనుంది టీం.
Ustaad Bhagat Singh | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. హరీష్ శంకర్ ఉస్తాద్భగత్ సింగ్ అప్డేట్
Pushpa : The Rule | అసలు పుష్ప ఎక్కడ..? అల్లు అర్జున్ పుష్ప.. ది రూల్ స్టన్నింగ్ అప్డేట్
Leo | విజయ్, లోకేశ్ కనగరాజ్ లియో కొత్త అప్డేట్