పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంచనా వేయడం కష్టమే. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రభాస్‌పై ఉన్న ప్రేమను, క్రేజ్‌ను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు (Prabhas birthday) ను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అభిమానులు సిద్దమయ్యారు.
శనివారం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ న్యూ ఫిల్టర్ ను మొదలుపెట్టింది. గ్లోబల్ ప్రభాస్ డే (Global Prabhas Day) పేరుతో రాధేశ్యామ్ టీజర్‌లోని మ్యూజిక్‌ను ప్లే చేస్తూ రూపొందించిన ఫిల్టర్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రభాస్ కు డెడికేట్ చేస్తూ తాజాగా రూపొందించిన ఫిల్టర్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు .
‘బాహుబలి తాలిస్’ నుండి అద్బుతమైన పోస్టర్ల వరకు, ప్రభాస్ పచ్చబొట్లు వేయించుకోవడంతోపాటు ఇంకా మరెన్నో రకాల యాక్టివిటీస్ తో తమ ఫేవరేట్ స్టార్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలే రాధేశ్యామ్ నుంచి విక్రమాదిత్య పోస్టర్ బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కేతో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత