e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home సినిమా ప్రియాంకచోప్రా స్ఫూర్తితో..

ప్రియాంకచోప్రా స్ఫూర్తితో..

‘అభినయానికి ఆస్కారమున్న విలక్షణ పాత్రలతో నటిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుంది’ అని చెప్పింది రాశీసింగ్‌. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘శశి’.  ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌నాయుడు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. రాశీసింగ్‌ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సునీత అనే గాయనిగా ఈ సినిమాలో కనిపిస్తా. నా నిజజీవితానికి పూర్తి భిన్నంగా ఎమోషనల్‌గా ఈ క్యారెక్టర్‌ సాగుతుంది. కథతో పాటు నా పాత్ర అందరికి కనెక్ట్‌ అవుతుంది. కొత్త తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దర్శకుడు శ్రీనివాస్‌ ఈ కథ వినిపించారు. చాలా నచ్చడంతో అంగీకరించా. నటనలో నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. స్వతహాగా సినిమాలపై చిన్నతనం నుంచి ఉన్న ఇష్టమే పరిణతితో నటించేలా ఉపయోగపడుతోంది. ప్రియాంకచోప్రా నా అభిమాన నటి.  ఆమెలా అన్ని జోనర్స్‌లో సినిమాలు చేయాలనుంది’ అని చెప్పింది. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రియాంకచోప్రా స్ఫూర్తితో..

ట్రెండింగ్‌

Advertisement