కత్తి నేనే.. యుద్ధం నాతోనే!
అగ్ర హీరో విజయ్ దేవరకొండ గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. గురువారం విజయ్ దేవరకొండకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ కత్తిపట్టుకొని వయొలెంట్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ అంశాలతో ఈ సినిమా రూపొందనుంది. ఇక మరో సినిమా వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. గురువారం కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
బీటలువారిన పొలాల మధ్యలో ఓ వీరుడి రాతి విగ్రహం కనిపిస్తుండగా.. దానిపై ‘ది లెజెండ్ ఆఫ్ కర్స్’ అనే క్యాప్షన్ రాసి ఉంది. 1854 నుంచి 1978 మధ్యకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొత్తగా ప్రకటించిన ఈ రెండు చిత్రాలు రూరల్ యాక్షన్, పీరియాడిక్ డ్రామా కథాంశాలతో తెరకెక్కనుండటంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

