Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్ (Tollywood Star Couples)లో ఉపాసన (Upasana) – రామ్‌చరణ్ ( Ram Charan) జంట ఒకటి. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పెండ్లైన పదేండ్లకు ఇప్పుడు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట ఆ అపురూప క్షణాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ‘బేబీ మూన్’ (Babymoon)ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ జంట దుబాయ్ వెకేషన్లో (Dubai Vacation) ఉన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అక్కడ నమ్మోస్ బీచ్ క్లబ్ (Nammos Beach Club) లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉపాసన బేబీ షవర్ ( Baby Shower) ను వేడుకగా నిర్వహించారు. ఉపాసన (Upasana) – చరణ్ (Charan)తో కేక్ కట్ చేయించి ఈ హ్యాపీ మూమెంట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వేడుకలో ఉపాసన-చరణ్ జంట వైట్ కలర్ అవుట్ ఫిట్స్‌లో మెరిసిపోయారు.
‘మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ వీడియోకు ఉపాసన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వేడుకలో రామ్ చరణ్-ఉపాసన స్నేహితులు, పలువురు కుటుంబ సభ్యులు, కజిన్స్ పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read..
Mrunal Thakur | నువ్వు మా సీతవు కాదు.. మృణాల్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!
Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన అకాల వర్షాలు.. స్తంభించిన జనజీవనం