Mrunal Thakur | నువ్వు మా సీతవు కాదు.. మృణాల్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). తాజాగా ఒక విషయంలో మృణాల్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ చిత్రంలో ఆమె చీరకట్టులో సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత ఆమెను అందరూ సీతగానే గుర్తు పెట్టుకున్నారు. ఇక ఆ సినిమాలోని మృణాల్ నటనకు ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించిందని.. ఆమె తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరని కామెంట్లు చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మృణాల్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మృణాల్ సినిమాలే కాదు సోషల్ మీడియా (Social media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం కాస్త ఘాటుగా, హాటుగా దర్శనమిస్తోంది. ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన నటి.. బీచ్‌లో బికినీతో దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘ఏంటి ఇది’, ‘ఆ ఫొటోలు ఏంటి..?’ అంటూ మండిపడుతున్నారు. ‘మా సీత ఇలా ఉండదు’, ‘నువ్వు మా సీతవు కాదు’, ‘రిప్ మై సీత’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Mrunal Thakur | సాగర తీరాన బికినీలో హీటెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్ ఫోటోలు..
Also Read
Viral News | వృద్ధురాలి సాహసం.. గుండె ఆపరేషన్ అయినా లెక్క చేయలేదు.. పరుగున వెళ్లి రైలు ప్రమాదాన్ని తప్పించి..!
Rupert Murdoch | నిశ్చితార్థం రద్దు చేసుకున్న వృద్ధ ప్రేమికులు.. కారణం ఏంటంటే..?
India Corona | 4 వేలకు పైనే కొత్త కేసులు.. 15 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

