Rupert Murdoch | నిశ్చితార్థం రద్దు చేసుకున్న వృద్ధ ప్రేమికులు.. కారణం ఏంటంటే..?
Rupert Murdoch | ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది. ఈ వృద్ధ ప్రేమికులు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు బయటకొచ్చాయి.
Rupert Murdoch | ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు గత నెలలో మార్దోక్ ప్రకటించారు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది. ఈ వృద్ధ ప్రేమికులు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు బయటకొచ్చాయి.
అమెరికాకు చెందిన వానిటీ ఫెయిర్ ( Vanity Fair) అనే మ్యాగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్దోక్-లెస్లీ వివాహ ప్రణాళిక అకస్మాత్తుగా ఆగిపోయింది. లెస్లీ స్మిత్ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసౌకర్యానికి గురయ్యారని, పెండ్లి ప్రణాళిక ఆగిపోవడానికి అదే కారణమని వానిటీ ఫెయిర్ తన కథనంలో వెల్లడించింది. అయితే, నిశ్చితార్థం చేసుకుని వారాలు కూడా గడవకముందే వీరి నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.
మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్లో మార్దోక్-లెస్లీ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు’ అని నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ (Anna Maria) ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు.
కాగా, రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో గడపాలని కొత్త జంట భావించింది. అయితే, తాజాగా ఈ వృద్ధ ప్రేమ జంట తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read..
Credit Card | కస్టమర్ క్రెడిట్ కార్డు బ్లాక్.. యాక్సిస్ బ్యాంకుకు 10వేల జరిమానా
Donald Trump | ఇది దేశానికే అవమానం.. క్రిమినల్ అభియోగాలు మోపడంపై ట్రంప్
Kushi | ఖుషీ మూవీ అప్డేట్.. కేరళలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

