Donald Trump | ఇది దేశానికే అవమానం.. క్రిమినల్ అభియోగాలు మోపడంపై ట్రంప్
కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం (Florida) వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ (Joe Biden) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది. విచారణ అనంతరం కోర్టు ఆయనను కస్టడీ నుంచి విడుదల చేసింది. డిసెంబర్ 4న మరోసారి ఆయనను కోర్టు విచారించనుంది. హష్ మనీతోపాటు మొత్తంగా ట్రంప్‌పై 34 అభియోగాలు నమోదయ్యాయి. కాగా, తనపై క్రిమినల్ అభియోగాలు మోపడం అమెరికాకే అవమానమని (Insult) ట్రంప్ వ్యాఖ్యానించారు.

కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం (Florida) వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ (Joe Biden) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అఫ్గానిస్థాన్ (Afghanistan) నుంచి మన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మనల్ని చూసి నవ్వుతున్నదని విమర్శించారు. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఇది దేశానికి అవమానం అని చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే తాను చేసిన నేరమని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు తనపై ఈ తప్పుడు కేసు పెట్టారని, వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు కేసు ఏంటంటే..
ట్రంప్‌తో తనకు శారీరక బంధం ఉందని, 2006లో ఓ హోటల్లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని పోర్న్‌స్టార్ స్టార్మీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టకుండా తనతో ట్రంప్ ఒప్పందం చేసుకొని డబ్బును చెల్లించారన్నారు. ఈ చెల్లింపులను వ్యాపార ఖర్చుగా చూపించారు. ఇలా బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించడమే ఇప్పుడు ట్రంప్‌పై అభియోగం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

