Anushka Sharma | ప్రముఖ బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఈ నెల 1వ తేదీన తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. భర్త విరాట్ కోహ్లీ, పిల్లలు, కుటుంబంతో కలిసి ఈ స్పెషల్ డేని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బర్త్‌డే సందర్భంగా విరాట్ – అనుష్క జంట బెంగళూరులో పార్టీ చేసుకున్నారు (Birthday Dinner). ప్రముఖ రెస్టారెంట్ లూపా (LUPA)లో ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేశారు. ఈ పార్టీకి క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్, అతని భార్య విని రామన్ తదితరులు హాజరయ్యారు. వీరంతా కలిసి డిన్నర్‌ను ఎంజాయ్ చేశారు. అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ – అనుష్క జంట 2017 డిసెంబర్ 11న ఇటలీలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో ఓ పాప వామిక జన్మించింది. ఈఏడాది ఫిబ్రవరిలో ఈ జంట రెండోసారి కూడా తల్లిదండ్రులయ్యారు. అనుష్క ఫిబ్రవరి 15వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క జంట సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. బాబుకు అకాయ్ (Akaay) అని నామకరణం కూడా చేశారు.
Also Read..
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
Bomb Threat | జీలం ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు
Amethi | కాంగ్రెస్ కంచుకోటలో ‘శర్మ’లు.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు