సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్ 2 (Indian 2). కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కి..బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోంది. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ 2 షూటింగ్ ఫైనల్‌గా రీస్టార్ట్ అయింది. కమల్ హాసన్ అండ్ టీం అదిరిపోయే లుక్‌తో కొత్త అప్డేట్ ఇచ్చింది.
ఇండియన్ 2 రెగ్యులర్ షూటింగ్ ఇవాళ మొదలైంది. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చెన్నైలోని పర్రీస్ కార్నర్‌కు సమీపంలో వేసిన భారీ సెట్టులో షూటింగ్ జరుగనుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. లీడ్ యాక్టర్లు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), బాబీ సింహాపై వచ్చే సీన్లను చిత్రీకరించనున్నారట. వీరితోపాటు సిద్దార్థ్ కూడా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి కమల్ హాసన్ షూట్లో జాయిన్ కానున్నాడు.
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్న ఇండియన్ 2 ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. తాజా లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
Filming for #Indian2 from September. Wishing team @shankarshanmugh , #Subaskaran , @LycaProductions and everyone else involved a successful journey.
Welcome onboard thambi @Udhaystalin @RedGiantMovies_ https://t.co/iCbBZFX8X4 pic.twitter.com/uKInYMy15W— Kamal Haasan (@ikamalhaasan) August 23, 2022
Read Also : Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
Read Also : Odela Railway Station Trailer | హత్యాచారం స్టోరీతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ ట్రైలర్
Read Also : Crazy News | క్రేజీ టాక్..ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్ రేపే..?