బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సినిమా చేస్తున్నాడనే సరికి దానిపై అంచనాలు ఎక్కువయ్యాయి. ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ స్క్రిప్టుకు.. ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయే కథ పడితే సినిమా రేంజ్ మామూలుగా ఉండదు అంటూ ఇప్పట్నుంచే లెక్కలు కట్టుకుంటున్నారు ఫ్యాన్స్. దానికి తగ్గట్లుగానే సలార్ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే సినిమాపై అంచనాలు మామూలుగా పెరగలేదు. గూగుల్‌కు వెళ్లి మరీ చెక్ చేసుకున్నారు సలార్ అంటే అర్థమేంటి అని..! సలార్ అంటే సేనాధిపతి అని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి నాయకుడిగా ఎలా మారాడనే కథతోనే ఈ సినిమా వస్తుంది.
ఈ మధ్య సలార్ సినిమా నుంచి కొన్ని లీకులు వచ్చాయి. దాంతో చిత్రయూనిట్ కాస్త కంగారు పడినా కూడా వెంటనే సైబర్ క్రైమ్ సాయంతో చక్కబెట్టారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీలో కూడా సలార్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ఇప్పుడు ఓ సమాచారం బయటికి వచ్చింది. ఇది కానీ నిజమైందంటే మాత్రం ప్రభాస్ అభిమానులకు పూనకాలే. ఈ సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీనికోసం ప్రభాస్ కూడా కోరమీసం పెట్టుకుని అదిరిపోయేలా మారిపోయాడు.
ఈ సినిమాలో భారత్, పాక్ యుద్ధం ఉండబోతుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఈ సినిమాలో 1971లో దాయాదీ దేశాల మధ్య జరిగిన యుద్దాన్ని చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి చిత్రబృందం సిద్ధమవుతుంది. ప్రభాస్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం ఈయన ఆదిపురుష్ షూటింగ్లో పాల్గొంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?