BRS | సుబేదారి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన వారం రోజుల నిరసన పిలుపు మేరకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు బుధవారం నిరసన చేపట్టారు. హనుమకొండ బాలసముద్రం నుంచి సుబేదారి కలెక్టరేట్ వరకు 420 హామీలతో కూడిన బ్యానర్‌తో భారీ ర్యాలీ చేపట్టారు. హనుమకొండ అదాలత్ జంక్షన్లో పోలీసులు బలగాలు ర్యాలీని అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు తోపులాట జరిగింది. హనుమకొండ ఏసీపీ నర్సింహారావు నేతృత్వంలో సుబేదారి సీఐ, కేయూ సీఐ రంజిత్‌కుమార్, రవికుమార్ పోలీసు బలగాలు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Arrest Brs Leaders
ఈ క్రమంలో పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీల ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను వంచించి పీడిత పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కాదు పీడిత పాలన అంటూ నినాదాలు చేశారు. అరెస్టు అయినవారిలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కమరున్నీసా బేగం, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్, జోరిక రమేశ్, నర్సింగ్, పార్టీ నాయకులు నార్లగిరి రమేశ్, వీరేందర్, కంజర్ల మనోజ్‌కుమార్, కలకోట్ల సుమన్, శ్రీధర్, వేల్పుల వేణుగోపాల్, రామ్మూర్తి, మహిళా నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నాయకులను పరామర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను ముందుపెట్టి అణిచివేయడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.