పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తో కలిసి నటించాలని ఎవరికుండదు చెప్పండి. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తో నటించే అవకాశం రావడమంటే జాక్ పాట్ కొట్టేసినట్టే. ఈ స్టార్ హీరోతో నటించేందుకు రెడీగా ఉన్నానంటోంది బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut). ఈ భామ 2009లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఏక్ నిరంజన్ (Prabhas) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తాను లీడ్ రోల్ చేస్తున్న తలైవి (Thalaivi) సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ..బాహుబలి స్టార్ నాకు మరో అవకాశమిస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని పూరీ జగన్నాథ్‌తో చెప్పినట్టు తెలిపింది. మరి కంగనా విజ్ఞప్తికి ప్రభాస్ ఒకే చెప్తాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. కంగనా 2008లో ధామ్ ధూమ్ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
కాగా దశాబ్దకాలానికిపైగా విరామం తర్వాత మళ్లీ తలైవి సినిమాతో కోలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. అలనాటి నటి మధుబాల ఆయన భార్యగా నటిస్తోంది.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని