స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ) దర్శకత్వంలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాజిబల్ (Mishan Impossible). మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 1న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి (Chiranjeevi ) మాట్లాడుతూ..మెటీరియల్, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్ స్వరూప్..ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అనుకోవడానికి, చెప్పుకోవడానికి ఇది చిన్న సినిమా అంటాం..కానీ విడుదలైన తర్వాత ఇది చిన్న సినిమా కాదు..అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమానే అవుతుందన్నాడు.
చిన్న పిల్లలుండొచ్చు కానీ ఇది పెద్దలకు మాత్రమే కాదు..అందరి సినిమా ఇది. నిరంజన్ రెడ్డి చాలా మంచి ప్రయత్నం చేశారు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్, అట్రాక్టింగ్ విషయం లేకుండా సినిమా చేసేందుకు నిరంజన్ రెడ్ది ఒప్పుకోరు. కథలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఫైనాన్షియర్, క్యాషియర్ అనే రోజులు అయిపోతున్నాయి. ప్రొడ్యూసర్ అవసరం ఏముంది డబ్బు ఇవ్వడం వరకే అనే పరిస్థితి నుంచి ప్రొడ్యూసర్ ను ఇన్వాల్వ్ చేయాలన్నారు చిరు.
నాకున్న ప్రొడ్యూసర్లలో అశ్వినీదత్, అరవింద్, కేఎస్ రామారావు, దేవీ ప్రసాద్ ఇలా అందరూ కథాచర్చల దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. వాళ్ల చొరవ డైరెక్టర్ కు, ఆర్టిస్టులకు భరోసా ఉంటుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నా నిర్మాత నిరంజన్ రెడ్డి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆచార్య సినిమాలో కొరటాల శివకు సపోర్టుగా ఉండి మంచి చెడులను ఎప్పటికపుడు చర్చిస్తూ..ఇది బాగుంది..ఇది బాగలేదు..అని చెప్పేంత ఇన్వాల్వ్ మెంట్ ఆయనకుంది. నిరంజన్ రెడ్డి ఇచ్చే ఇన్ పుట్స్ చాలా విలువైనవన్నారు చిరంజీవి.