AR Murugadoss | ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో వచ్చిన చిత్రం సికిందర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న మదరాసి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఏఆర్ మురుగదాస్. ఈ మూవీతో ఎలాగైనా బ్రేక్ అందుకోవాలని చూస్తున్న మురుగదాస్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. కాగా సికిందర్ సినిమా ఫెయిల్యూర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు మురుగదాస్.
సికిందర్ గురించి మాట్లాడుతూ.. కథామూలం నాకు చాలా దగ్గరగా ఉంటుంది. సికిందర్ చాలా మంచికథ. సాధారణంగా మనం రిలేషన్షిప్స్కు అంతగా విలువ ఇవ్వం. కానీ మన స్నేహితుల్లో ఒకడు కనిపించకపోతే.. ఏం జరిగి ఉంటుందని ఆలోచించడం మొదలుపెడతాం. అదేవిధంగా భార్య చనిపోయిన తర్వాత చాలా విషయాలు పూర్తిగా మారిపోతాయి. మన గ్రామమంతా కుటుంబంలా మారిపోతుంది. సినిమా గురించి నేను ఆలోచించిన విధానం వేరు.. కానీ సినిమా ఎలా రెడీ అయిందనేది పూర్తిగా భిన్నమైంది. నేను సరిగా చూపించలేకపోయా.. సినిమా ఫెయిల్యూర్‌కు నేనొక్కడినే బాధ్యుడిని కాదన్నాడు.
అయితే గజినీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాకు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారా..? అని అడుగగా.. గజినీ రీమేక్ సినిమా. అమీర్‌ఖాన్‌తో చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇప్పటికే ఆ సినిమా మీద పనిచేశాను. నేను ఏదైనా చేస్తే ప్రేక్షకులు దానిని తిరస్కరిస్తే నేను అర్థం చేసుకుంటా. కానీ ఒకవేళ నేను కోరుకున్నది జరుగకపోతే అది నన్ను ప్రభావితం చేయదంటూ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!