Upendra | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka).. ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఉపేంద్ర ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రామ్ టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్నాడు.
ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామ్ అండ్ ఉపేంద్ర టీం ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది.రియల్ ఆంధ్ర కింగ్ ఎవరనే దానిపై వస్తున్న పుకార్లపై ఉపేంద్ర స్పష్టత ఇచ్చాడు. ‘ఆంధ్ర కింగ్ నేను కాదు. రామ్ పోతినేని కూడా కాదు. సినిమాలో మరో వ్యక్తి ఉన్నాడు అతడే నిజమైన ఆంధ్ర కింగ్..’ అని చెప్పాడు ఉపేంద్ర.
సినిమాలో ఆంధ్ర కింగ్ అంటే ఉపేంద్రనే అని ఇప్పటిదాకా ఫిక్సయిన వారికి.. ఈ కన్నడ స్టార్ యాక్టర్ చేసిన తాజా కామెంట్స్ క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరని తెగ ఆలోచించడం మొదలుపెట్టేశారు నెటిజన్లు, మూవీ లవర్స్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ట్విస్ట్‌తో మేకర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.
ఈ చిత్రంలో సూర్యకుమార్ అభిమాని పాత్రలో రామ్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు విజువల్స్ క్లారిటీ ఇచ్చేశాయి. ఈ మూవీలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైవత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!