Prithviraj Sukumaran | సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పినసవరం లేదు. స్టార్ యాక్టర్లకు పెద్దగా చెప్పుకునేంత ఆర్థిక సమస్యలుండవని చాలా మంది అనుకుంటుంటారు. అయితే తనకు మాత్రం ఈ జాబితాలో నుంచి మినహాయింపునివ్వాలని అంటున్నాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తనకు కూడా ఈఎంఐలున్నాయని.. ప్రతీ నెలా తన కారుకు ఈఎంఐ కడుతున్నానని చెప్పాడు.
పృథ్విరాజ్ సుకుమారన్ తన లైఫ్ స్టైల్ గురించి ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. డైరెక్టర్ కావాలని తాను తీసుకున్న నిర్ణయం.. పనికిమాలినదిగా చెప్పుకొచ్చాడు. తాను డైరెక్టర్‌గా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ క్రాప్ట్‌పై ఎక్కువ టైం కేటాయించానన్నాడు. ఈ క్రమంలో అనేక నటన అవకాశాలను కోల్పోయానని.. ఇది తాను ఆలస్యంగా గ్రహించానని వెల్లడించాడు.
డబ్బు సంపాదించడమే ధ్యేయంగా సినిమాలను ఎంపిక చేసుకుంటారా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను డబ్బు కోసం కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తానన్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. తక్కువ టైంలో ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పటి నుంచి నేను కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తున్నా. అయితే నేను ఎక్కువగా నమ్మే బ్రాండ్స్‌నే ఎండార్స్ చేస్తా.. తెలియని బ్రాండ్స్‌ను ఎండార్స్ చేయను.. అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు అందరిలాగే తాను కూడా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నానని, తన కారు లోన్‌ను చెల్లించేందుకు ఎక్కువగా పనిచేశానని పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పాడు. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రస్తుతం మోహన్ లాల్ లీడ్ రోల్లో నటిస్తోన్న డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ L2E: Empuraan ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
Devara Part 1 | దేవర ప్రమోషన్స్ టైం.. జపాన్‌లో తారక్, కొరటాల శివ బిజీబిజీ
OTT Movies| ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడే సందడి.. ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!
Dia Mirza | రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి.. దియా మీర్జా డిమాండ్