టెలివిజన్ నుంచి బిగ్ స్క్రీన్ కు వచ్చిన బాలీవుడ్ (Bollywood) నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆమె నటించిన కుంకుమ్ భాగ్య సీరియల్ పాపులర్ అయి చిత్రపరిశ్రమలో అవకాశాలు తీసుకొచ్చింది. సినిమాల్లోకి వచ్చాక తన ఫేవరేట్ యాక్టర్స్ తో కలిసి నటించడం ఒక ఫ్యాన్ గర్ల్ మూవ్ మెంట్ లా అనిపిస్తున్నదని చెబుతోందీ తార. తను టీనేజ్ లో సినిమాల్లో చూసిన హృతిక్ తో, ఫర్హాన్ అక్తర్ లాంటి వాళ్లతో కలిసి నటించడం కలలా ఉందని అంటున్నదీ నాయిక.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ లవ్ సోనియాలో నటించిన తర్వాత హృతిక్ రోషన్ (Hrithik roshan)తో సూపర్ 30, జాన్ అబ్రహాంతో బాట్లా హౌస్, ఫర్హాన్ అక్తర్ కు జోడీగా తూఫాన్ చిత్రాల్లో నటించింది మృణాల్. ప్రస్తుతం ఆమె చేతిలో విడుదలకు సిద్ధంగా ఉన్న జెర్సీ(Jersey)తో పాటు మరో నాలుగు సినిమాలున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ…హృతిక్ రోషన్ లక్ష్య సినిమాను థియేటర్ లో చూసి ఆయనకు దర్శకుడు ఫర్హాన్ కు అభిమాని అయ్యాను. హీరోయిన్ గా మారాక..వీళ్లిద్దరితో కలిసి నటించాను. వాళ్లతో సెట్స్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ గర్ల్ మూవ్ మెంట్ ఫీలయ్యేదాన్ని. నేను బాగా నటిస్తున్నాను అని చెబితే ఆ రోజు నాదే అనిపించేది. అని చెప్పుకుంది.