Sivakarthikeyan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ SK23. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో SKxARMగా మదరాసి టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్‌తోపాటు టైటిల్ గ్లింప్స్, ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేశాడు శివకార్తికేయన్.
మదరాసిలో గెస్ట్ అప్పీయరెన్స్ (అతిథి పాత్ర) కోసం ఓ తెలుగు హీరోను ఎంపిక చేయాలనుకుంటే మీరు ఎవరిని ఒకే చేస్తారని ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాపులర్ యాంకర్ సుమ శివకార్తికేయన్‌ను అడిగింది. దీనికి శివకార్తికేయన్ స్పందిస్తూ.. సినిమా అగ్రెసివ్‌గా ఉంటుంది కాబట్టి నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ ను ఎంపిక చేస్తానని చెప్పాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. తమిళ స్టార్ హీరో రియాక్షన్‌కు తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మదరాసి చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
I would prefer @tarak9999 sir, if there is a guest role in #Madharaasi – @Siva_Kartikeyan ❤️.@rukminitweets Blushing For #NTRNeel 🥳🤩. pic.twitter.com/C5seU7aXmi
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) September 3, 2025
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?