Lokah Franchise | ఈ రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించాలంటే రెగ్యులర్ స్టోరీలైతే మాత్రం కష్టమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథలో కొత్తదనంతోపాటు ఎక్జయిటింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిల్మ్ మేకర్స్ కూడా ప్రేక్షకులు అభిరుచులకు అనుగుణంగా తమ ప్రాజెక్టులను డిజైన్ చేసుకుంటున్నారు. ఎంతలా అంటే తమ సినిమాలను ఏకంగా ప్రాంఛైజీగా మార్చుకునేంతలా.
అలాంటి కేటగిరీలో వస్తుంది థియేటర్లను షేక్ చేస్తున్న తాజా మలయాళ ప్రాజెక్టు ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) హీరోహీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో డొమినిక్ అరుణ్ టీం స్టన్నింగ్ వార్తను షేర్ చేసింది. లోక 5 పార్టుల సిరీస్‌గా రాబోతుందని చెప్పారు మేకర్స్.
అంతేకాదు ఈ 5 కథలన్నీ ఫస్ట్ పార్ట్ షూటింగ్‌కు ముందే రెడీ అయ్యారని డైరెక్టర్ డొమినిక్ అరుణ్ చెప్పాడు. మొత్తం సిరీస్‌లో ఎవరు విలన్ అనేదానిపై చంద్ర ఓపెనింగ్ సీన్లో హింట్ ఇచ్చేశామని కూడా చెప్పాడు. కొత్త జోనర్లో నయా స్టోరీ టెల్లింగ్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేస్తోంది లోక. అప్‌కమింగ్ పార్టులు కూడా ఇదే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకొస్తే.. లోఖ భారతీయ సినిమాలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్‌గా నిలువబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మలయాళ మొట్టమొదటి ఫీ మేల్ సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. లోక ఫస్ట్ వీక్‌లోనే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయిన అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?
SSMB 29 | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా.. కెన్యా మసాయి మరా వైపే అందరిచూపు.!
Akshay Kumar | గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్