krish | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తుండగా.. ఇప్పటికే హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచింది. మొదట క్రిష్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం ఆ తర్వాత అనూహ్యంగా జ్యోతికృష్ణ చేతిలోకి వెళ్లిపోయింది.
అయితే అనుష్క నటించిన ఘాటి సినిమా ప్రమోషన్స్‌లో క్రిష్ హరిహరవీరమల్లు పార్ట్-2పై కీలక విషయాలను షేర్ చేసుకున్నాడు. హరిహరవీరమల్లులో నేను చాలా వరకు సన్నివేశాలను ఢిల్లీ దర్బార్‌లో షూట్ చేశాను. ఈ సన్నివేశాలు భారీ స్థాయిలో వచ్చేందుకు అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ వేశాం. కరెంట్ బల్బుపై పవన్ కల్యాణ్ చేసే ఫైట్ సీక్వెన్స్ స్టన్నింగ్‌గా ఉంటుంది. కానీ ఇదంతా కథ ఢిల్లీకి మారినప్పుడు మాత్రమే ఉంటుంది. సుమారు 40 నిమిషాల పుటేజీ అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఈ పుటేజ్ అంతా రెండో పార్టు కోసం రెడీ చేసి ఉంచామన్నాడు క్రిష్.
అంతేకాదు పార్ట్ 2లో పవన్ కల్యాణ్ అద్భుతమైన స్టంట్స్ చేశాడు. హరిహరవీరమల్లు ఔరంగజేబు కోర్టుకు వెళ్లి మొఘల్ సామ్రాజ్యంలో ప్రత్యేకంగా రూపొందించబడిన సింహాసనంపై నిలబడి.. అతడికి సవాలు విసిరి కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకొస్తాడు. జనాలు ఇప్పటివరకు చూడని చాలా అద్భుతమైన సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు క్రిష్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హరిహరవీరమల్లు దర్శకత్వ బాధ్యతలు క్రిష్ నుంచి జ్యోతికృష్ణ చేతిలోకి వెళ్లడంతో.. ఫస్ట్ పార్ట్‌లో డైరెక్టర్ క్రిష్ మార్క్ ఎలిమెంట్స్ మిస్సయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ లోటును సెకండ్ పార్ట్ భర్తీ చేయనుందని క్రిష్ చేసిన తాజా కామెంట్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇంకేంటి మరి ఫస్ట్ పార్ట్‌లో మిస్సయిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండో పార్ట్‌లో చూడబోతున్నామన్నమాట.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మించారు.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?
SSMB 29 | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా.. కెన్యా మసాయి మరా వైపే అందరిచూపు.!
Akshay Kumar | గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్