Mahira Khan | షారుక్‌ఖాన్‌తో నటించిన రయీస్ (Mahira Khan).తో ఇండియాలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది పాకిస్థానీ నటి మహీరాఖాన్ (Raees). సోషల్‌మీడియాలో ఈ భామకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor)తో కలిసి సిగరెట్ పట్టుకుని దిగిన ఫొటోలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయని తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనే విషయంపై మాట్లాడింది. ది లిటిల్ వైట్ డ్రెస్ అంటూ ఓ జాతీయ మీడియాలో తనపై రాసిన కథనం గురించి చెబుతూ.. అప్పుడేం జరుగుతుందో అంతగా గుర్తించలేకపోయానంది. పాక్‌లో మంచి నటిగా పాపులర్ అయిన ఈ నటికి ఏమైందంటూ వచ్చిన వార్తలను చూసి తనకేమైనా పిచ్చి లేసిందా..? అని అనుకున్నానని చెప్పింది. దీంతో ఇక తన కెరీర్ క్లోజ్ అయిపోయిందనిపించిందన్న మహీరాఖాన్.. తన లైఫ్‌లో అవే కష్టతరమైన రోజులని చెప్పింది.
ఓ వైపు విడాకుల బాధలో ఉంటే.. మరోవైపు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడిందని.. ఈ విషయంలో తాను చాలా సార్లు ఏడ్చిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది. తాను సింగిల్ పేరేంట్గా ఉన్న టైంలోనే ఈ ఫొటోలు లీక్ అయ్యాయని.. కానీ కష్టకాలంలో తన అభిమానులు మద్దతుగా నిలిచారంది మహీరాఖాన్. ఇప్పుడీ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?