Mahesh Babu | హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడీ ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్ వస్తోంది ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa The Lion King). ఈ క్రేజీ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ముఫాసా పాత్రకు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వాయిస్ అందించాడు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తన ఎక్జయిట్మెంట్ను షేర్ చేసుకున్నాడు మహేశ్ బాబు. అత్యంత ఐకానిక్ పాత్రల్లో ఒకటి ముఫాసా. నా కల నిజమైందని భావిస్తున్నా. నేను ఎప్పటి నుంచో చూస్తున్న పాత్రల్లో ముఫాసా ఒకరు. ముఫాసా తన కుటుంబాన్ని చూసుకునే విధానం నాకు చాలా ఇష్టం. నేను అతనితో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉన్నానని చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు.
హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్