Anantha Sriram | అమరావతి పరిధిలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ (Anantha Sriram) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారు. హైందవ ధర్మ హననం జరుగుతుందని అనంత్ శ్రీరామ్ అన్నారు.
కొందరు అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుందని అనంత్ శ్రీరామ్ పేర్కొన్నారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారు. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు. ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నా. తప్పును తప్పు అని చెప్పాల్సిందేనన్నారు అనంత్ శ్రీరామ్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్