Sai Pallavi | తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటీమణుల్లో ఒకరు సాయిపల్లవి ( Sai pallavi). ఈ భామ తాను చదువుకున్న కోయంబత్తూరులోని ఎవిలా స్కూల్ వార్సికోత్సవాన్ని ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుంది.
ఈవెంట్లో సాయిపల్లవి మాట్లాడుతూ.. నేనిక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. కేవలం నా జ్ఞాపకాల వల్ల మాత్రమే కాదు.. నా స్కూల్ టైంలో ఎక్కువగా ఈ ఆడిటోరియంలోనే ఉండేదాన్ని. క్లాస్‌కు డుమ్మా కొట్టి.. ఇక్కడికొచ్చి డ్యాన్స్ చేసేదాన్ని. నేను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్‌నని మీరనుకుంటున్నారని నాకు తెలుసు. నేను కేవలం అటెండెన్స్ ఇచ్చేసి.. ఇక్కడే రోజంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. కానీ అప్పడు నాకా విషయం తెలియదు.. నాకిప్పుడు తెలిసిందేంటంటే.. నిజానికి నేనేం చేస్తున్నానో టీచర్లకు బాగా తెలుసు. వాళ్లు అలా చేయడం వల్ల చాలా యంగ్ ఏజ్‌లోనే నాకు స్టేజ్ ఫియర్ పోయింది. నేనిక్కడి దాకా వచ్చేందుకు నాకు సపోర్ట్‌గా నిలిచారంటూ చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో ఆందోళన కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ విషయాలు మన దృష్టి మరల్చుతున్నాయి. మీరు నిజంగా ఎవరో తెలుసుకోవడానికి మీతో మీరు సంభాషించుకోవాలని సూచించింది సాయిపల్లవి.
ఇష్టంగా డ్యాన్స్ చేయడం, మెడిసిన్ చేయడం, మంచి మనిషిగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకోవడం, క్రమశిక్షణ వల్ల నాకు లభించిన ప్రతిదాన్ని నేను పొందుతాను. పిల్లలతో నా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివరలో మళ్లీ స్కూల్‌కు వస్తాను.. అని చెప్పింది సాయిపల్లవి.
#SaiPallavi‘s heartfelt speech at Avila School Annual Day 🥹🤍
Other than being good at Dancing doing medicine n i recieve whatever I’ve because of discipline knowing what it is to be a good human being..I’ll comeback again school this year end I’ve so much to share with kids♥️ pic.twitter.com/E9ZSKF5hpn
— Sai Pallavi FC™ (@SaipallaviFC) January 23, 2025
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది