టాలీవుడ్లో ఉన్న టాలెంట్ యాక్టర్లలో లీడింగ్ పొజిషన్లో ఉంటాడు యువ నటుడు శర్వానంద్ (Sharwanand). గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, శతమానం భవతి, జానుతోపాటు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కోవిడ్ కాలంలో రెండేళ్ల టైంలో నాలుగు చిత్రాలను విడుదల చేశాడు. అయితే జాను (Jaanu) సినిమా తర్వాత బరువు పెరిగిన (Over Weight)శర్వానంద్ ఇపుడు మళ్లీ స్లిమ్‌గా పాత లుక్‌లోకి మారిపోయాడు.
ఓ యూబ్యూట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు శర్వానంద్. జాను టైంలో పెద్ద ప్రమాదం జరిగింది. యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడటం వల్ల బాగా బరువును పెరిగా. కరోనా సమయంలో 4 సినిమాలు చేశా. దాంతో నాకు వర్కవుట్కు సమయం దొరికేది కాదు. ఆ తర్వాత వర్కవుట్ కోసం 6 నెలలు బ్రేక్ తీసుకున్నా. ఏ సినిమా షూటింగ్ పెట్టుకోలేదన్నాడు.
రెమ్యునరేషన్ (remuneration)భారీగా తీసుకుంటున్నారన్న ప్రశ్నపై శర్వానంద్ స్పందిస్తూ…19 ఏళ్ల ప్రాయం నుంచి సంపాదించడం మొదలుపెట్టా. అప్పటి నుంచి అమ్మానాన్న నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. అమ్మా నాన్న డబ్బులతో ఎంజాయ్ చేయొద్దనుకున్నా. నా తొలి ప్రాధాన్యత ఖచ్చితంగా డబ్బు కాదు. కానీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. ఎవరైనా మోసం చేస్తే భరించలేను. ఓ నిర్మాతతో నాకు ఛేదు అనుభవం ఎదురైందంటూ చెప్పుకొచ్చాడు.