Raashii Khanna | పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై పవన్ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఇటీవలే పవన్ కల్యాణ్‌కు రాశీఖన్నా బర్త్ డే విషెస్ చెబుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సందర్భంగా లొకేషన్లో డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్‌తో సీన్ గురించి డిస్కషన్ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. పవన్ కల్యాణ్ సార్ మీ బలం, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో మీ ప్రయాణం మిలియన్ల మందికి స్పూర్తిని అందిస్తూనే ఉందంటూ క్యాప్షన్ కూడా పోస్ట్ చేసి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఓ చిట్‌చాట్ సెషన్లో తాను ఎంతో అభిమానించే పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ విషయమై ఆసక్తికర కామెంట్స్ చేసింది రాశీఖన్నా. పవన్ కల్యాణ్ సార్‌ను ఒక ఫొటో కోసం అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయొద్దనిపించింది. కానీ ఒక రోజు పవన్ కల్యాణ్ తనకు తానే వచ్చి ఆయనతో ఓ ఫొటో దిగాలని అడిగారు. ఇది చాలా గొప్ప విషయం. అప్పుడు కలిగిన ఫీలింగ్ నా మాటల్లో చెప్పలేనంది రాశీఖన్నా. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిట్‌చాట్ సెషన్లో
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
I didn’t want to make @PawanKalyan sir feel uncomfortable for a picture. But this day, he himself asked me to take a picture with him, it was a very nice thing, I can’t explain it in words.
– #RaashiiKhanna #UstaadBhagatSingh pic.twitter.com/1jW4mQRq70— Satya (@YoursSatya) December 20, 2025
OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే.!
Andhra King Taluka OTT | నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!