Andhra King Taluka | రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). తెలుగు సినీ అభిమాని కథగా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా తిరక్కుండానే ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య(ఉపేంద్ర) పేరుమోసిన సూపర్‌స్టార్. అశేషమైన అభిమానుల అతని సొంతం. అయితే.. తనకు బ్యాడ్ పిరియడ్ నడుస్తూ ఉంటుంది. విడుదలైన సినిమాలన్నీ ఫ్లాపులవుతుంటాయి. ఈ క్రమంలో సూర్య వందవ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత చేతులెత్తేస్తాడు. ఓ మూడు కోట్లు ఉంటే సినిమా పూర్తవుతుంది. ఆ మూడు కోట్ల కోసం సూర్య ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఓ నిర్మాతను డబ్బు అడుగుతాడు. అతను తన కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో తండ్రి పాత్ర వేస్తే డబ్బు సర్దుతానంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూరకపోవడంతో చివరికి ఆ నిర్మాత పెట్టిన షరతుకి ఓకే చెప్పాలనుకుంటాడు. తన నిర్ణయాన్ని ఆ నిర్మాతకు చెప్పేలోపే సూర్య అకౌంట్లో మూడు కోట్లు పడతాయి. ఆ డబ్బు ఎవరు వేశారో సూర్యకు అర్థం కాదు. రాజమండ్రి దగ్గర్లోని ఓ పల్లెటూరి కుర్రాడు ఆ మూడు కోట్లు వేశాడని తెలిసి సూర్య షాక్ అవుతాడు. అతను తన అభిమాని తెలుసుకున్న సూర్య.. అతన్ని కలవాలని బయలు దేరతాడు? మరి సూర్య అభిమానిని కలిశాడా? ఓ పల్లెటూరి కుర్రాడికి ఈ మూడు కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఆ కుర్రాడెవరు? అతని కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
Ippati dhaaka star biopics ey chusam, ippudu its time for a fan biopic 😎🌟 pic.twitter.com/XsbP0dGrs6
— Netflix India South (@Netflix_INSouth) December 20, 2025