Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడు పదుల వయస్సులోనూ ఓ వైపు అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిసిందే. తన దైనందిన జీవితంలో యోగాకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని యోగా బాట పట్టారు తలైవా.
ఈ స్టార్ యాక్టర్ ఇంతకీ ఎక్కడికి వెళ్లారో తెలుసా..? జార్ఖండ్ రాజధాని రాంఛీలోని ప్రముఖ యోగా సెంటర్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు తలైవా. నమస్కారం.. నేను రాంఛీ నుంచి వైఎస్ఎస్ యోగా సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఇక్కడికి వచ్చాను. రాంఛీకి రావడం ఇది మూడోసారి. ఈ సారి మరింత ఎక్కువ సమయం కేటాయించే అవకాశం వచ్చింది. రెండు రోజులు గడిచిపోయాయి. ఈ సారి నాకు ప్రత్యేకించి గురూజీ రూంలో మెడిటేషన్ చేసే అవకాశం లభించింది. ఇక్కడికి వచ్చిన అనుభూతి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను.
అలాంటి వైబ్రేషన్, అనుభూతి పొందాను. గత 21 ఏండ్ల నుంచి క్రియను చేస్తున్నాను. ఈ క్రియ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు వివరిస్తా. నేను చెప్పేదేంటంటే మీరిది తరచూ తప్పక చేయాల్సి ఉంటుంది. తరచూ మీరు ఇది పాటిస్తే ఆ తర్వాత పొందే శక్తి ఏంటో మీరు చూస్తారంటూ సుదీర్ఘ సందేశాన్ని అభిమానులు, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకున్నాడు.
.#SuperstarRajinikanth @rajinikanth Speaks about “Kriya Yoga” in YSS Ranchi ashram. pic.twitter.com/dtlmLOWGKb
— BA Raju’s Team (@baraju_SuperHit) February 9, 2025