ఛలో, గోవిందం సినిమాలతో తెలుగులో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). పుష్ప సినిమాతో ఇండియావైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప 2తోపాటు బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రష్మికపై కన్నడ ఇండస్ట్రీ (kannada industry) నిషేధం విధించిందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఈ గాసిప్స్ పై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది.
తనపై కన్నడ సినీ ఇండస్ట్రీ నిషేధం విధించిందన్న వార్తలను రష్మిక కొట్టిపారేసింది. నాపై శాండల్‌వుడ్ ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతార సినిమా విషయంలో కొంతమంది నాపై అత్యుత్యాహం చూపించారు. కాంతార మూవీ చూసి చిత్రయూనిట్‌కు మెసేజ్ పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందనేది ప్రపంచానికి తెలియదు. నా పర్సనల్ విషయాలు కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు బయటకు విడుదల చేయలేను. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు. వ్యక్తిగతంగా నేనేం చేస్తున్నానో ప్రజలకు చెప్పడం నా బాధ్యత..అని స్పష్టత ఇచ్చింది రష్మిక .
పుష్ప 2 రష్యన్ వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా రష్యాలో చక్కర్లు కొడుతోంది రష్మిక. త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. రష్మిక ఈ ఏడాది బిగ్ బీతో కలిసి నటించిన గుడ్‌బై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్