Genelia Deshmukh | బొమ్మరిల్లు, సత్యం, హ్యాపీ, ఢీ, రెడీ, సై చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న భామ జెనీలియా. తన నటనతో ఎన్నో అవార్డులతో పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అయితే ఈ భామ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం చాలారోజులు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ చిత్రంలో జెనీలియా కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు జెనీలియా.
ఈ క్రమంలోనే ఒక యాంకర్ జెనీలియాని అడుగుతూ.. మీకు సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చెప్పుకోదగ్గ పాత్రలు అందలేదు కదా అని అడుగుతాడు. దీనికి జెనీలియా స్పందిస్తూ.. యాంకర్ మాటాలను తప్పుబట్టింది. నాకు ఎప్పుడూ అలా జరుగలేదు. నా సౌత్ సినిమాలు చూసుకుంటే.. నాకు ఎప్పుడూ ఉత్తమ పాత్రలు వచ్చాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చేసిన పని నాకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. సౌత్ నా కెరీర్ ఎదిగిన స్థలం.. ఇక్కడ నాకు లభించిన పాత్రలను నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ జెనీలియా చెప్పుకోచ్చింది.
Anchor: South films never used to give solid roles.
Genelia : No, I always got – if you see my South films, I’ve had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ
— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025
Read More