కన్నడ పవర్‌స్టార్ (Sandalwood) పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) ఆకస్మిక మరణంతో యావత్ సినీపరిశ్రమతోపాటు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ (puri jagannadh) పునీత్ రాజ్ కుమార్‌ను అప్పు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న వార్త తెలియడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశాడు పూరీ జగన్నాథ్. ఈ మేరకు ట్విటర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశాడు.
‘పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆశ్చర్యంగా ఉంది. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా. పునీత్ నాకు చాలా క్లోజ్. ఆ ఫ్యామిలీఅంటే నాకు చాలా ఇష్టం. పునీత్ చాలా మంచివాడు. ఎంతోమందిని ఆదుకున్నాడు. సాయం చేశాడు. అలాంటి మనిషి దూరమవడం నేను నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాను. రాజ్‌కుమార్ లేరు. పార్వతమ్మ లేరు. వరదప్ప లేరు..ఇపుడు పునీత్ కూడా లేడు అంటే తట్టుకోలేకపోతున్నా.
Director #PuriJagannadh expressed grief on losing his dearest friend #PuneethRajkumar pic.twitter.com/cKnm7aLyNA
— BA Raju's Team (@baraju_SuperHit) October 29, 2021
చాలా చిన్న వయస్సు. కుర్రాడు. ఇద్దరం కలుద్దామని నెల క్రితమే మాట్లాడుకున్నాం. కలిసే లోపు ఇది జరిగింది. పునీత్ మరణం కుటుంబానికే కాదు..అభిమానులకే కాదు.కన్నడ పరిశ్రమకు పెద్ద లోటు. లవ్ యూ పునీత్. నిన్ను చాలా మిస్సవుతున్నానని’ వీడియో సందేశంలో పేర్కొన్నాడు పూరీజగన్నాథ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి