Dragon | తెలుగు ప్రేక్షకులతోపాటు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తోన్న చిత్రం Dragon (వర్కింగ్ టైటిల్) కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు తారక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్ అభిమానుల కోసం అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటో తెలుసా..?
ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ గురించే.. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారట. తాజా టాక్ ప్రకారం ప్రత్యేకంగా డిజైన్ హౌస్ సెట్‌ను వేయగా.. దీని కోసం ఏకంగా రూ.15 కోట్టు ఖర్చు పెట్టారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు డ్రాగన్ నెక్ట్స్ షెడ్యూల్ ఈ ఇంటిలోకి జరుగనుంది. నెల రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్ వినాయక చవితి తర్వాత మొదలు కానుందట. తారక్ సెప్టెంబర్ తొలి వారంలో సెట్స్‌లో జాయిన్ కానున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో ప్రశాంత్ నీల్ అండ్ టీం తారక్‌పై వచ్చే హై వోల్టేజీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.
చాలా కాలంగా అప్డేట్ కావాలని ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ వార్త ఖచ్చితంగా గుడ్‌న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
Mandaadi | ఈ సారి తగ్గేదేలే అంటున్న సుహాస్.. హైప్ పెంచుతోన్న మండాడి స్పెషల్ పోస్టర్
War 2 | కూలీ చిత్రాన్ని అందుకుంటుందా..? తారక్, హృతిక్ రోషన్ వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఇవే
Shruti Haasan | నంబర్ గేమ్ కొత్త సమస్య.. కమల్ హాసన్ థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్