NKR21 | బింబిసార తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి NKR21. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే NKR21 అనౌన్స్ మెంట్ పోస్టర్లో పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అలా ఎలా సినిమా తర్వాత అశోక క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ మూవీ క్లైమాక్స్ షూట్ పూర్తయింది. ఈ కీలక సన్నివేశాన్ని కల్యాణ్ రామ్ టీం 30 రోజులకుపైగా చిత్రీకరించిందట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అంతేకాదు క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం రూ.8 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్. ఇది కల్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ మొత్తం కావడం విశేషం.
బ్రహ్మ కడలి టీం వేసిన సెట్ డిజైన్‌లో ఫైట్ మాస్టర్ రామకృష్ణ నేతృత్వంలో కల్యాణ్ రామ్‌తోపాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులపై వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగనుందన్న వార్త ఇప్పుడు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
𝐈𝐟 𝐲𝐨𝐮 𝐜𝐚𝐧’𝐭 𝐛𝐞 𝐚 𝐠𝐨𝐨𝐝 𝐞𝐱𝐚𝐦𝐩𝐥𝐞, 𝐛𝐞 𝐚 𝐭𝐞𝐫𝐫𝐢𝐛𝐥𝐞 𝐰𝐚𝐫𝐧𝐢𝐧𝐠 ⚠️
Here’s the Fiery First Look of #NKR from #NKR21 🔥
Happy Birthday, @NANDAMURIKALYAN ❤🔥#HappyBirthdayNKR ❤️🔥@vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/6ErzgpmOOE
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!